కొల్లాపూర్, వెలుగు : నాగర్కర్నూల్జిల్లాలోని సోమశిలలో ఉన్నశ్రీ వీర అభయ ఆంజనేయ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాల్లో బుధవారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మూడు రోజులుగా వేదమంత్రాల మధ్య శాస్త్రోక్తంగా పూజలు జరుగుతుండగా, బుధవారం ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన సమయంలో అది మధ్యలోకి విరిగిపోవడంతో భక్తులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
ఆచారాల ప్రకారం విరిగిపోయిన ధ్వజస్తంభాన్ని తిరిగి ప్రతిష్ఠించకూడదని నిర్ణయించి, వెనువెంటనే నూతన ధ్వజస్తంభాన్ని తెప్పించి ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆలయ వర్గాలు స్పష్టం చేశాయి.
